కొమరం పులి పాటలు విన్నారా?

Posted on జులై 20, 2010

4



ఎ.అర్.రెహమాన్ ఎంతటి ప్రసిద్ధుడో మనకు తెలిసిందే. ఆయన సంగీత సారధ్యంలో వచ్చిన కొమరం పులి పాటలు ఇటీవలి మార్కెట్లో విడుడలయ్యాయి.
పవన్ కళ్యాణ్-ఎస్.జె.సూర్య జంట ఇంతకు ముందు మనని “ఖుషి” చేశారు. ఆ సినిమా అలాగే సినిమా పాటలు బాగా హిటయ్యాయి. ఈ సారి ఎ.అర్.అర్ తో కలసి ఎంతవరకూ మ్యాజిక్ చేయగలిగారూ?

ఈ పాటలు నేను విన్నాను. కానీ చాలా కష్టపడి వినాల్సి వచ్చింది. ఎక్కువ గా ఉహించుకొని నిరాశపడ్డానేమో తెలియదు కానీ…అసలు ఎన్నిసార్లు విన్నా ఒక్క పాట కూడా మళ్ళి వినాలనిపించలేదు. అక్కడక్కడా బీట్లు బాగున్నాయి. కొన్ని పాటల్లొ ట్యూన్ కోసం విపరీతంగా మాటల్ని సాగతీశారు. కొంత తమిళ డబ్బింగ్ సినిమాల్లో వినిపించే ’సర్దు’ మాటల్లా అనిపించాయి.

నాకొక్కడికే ఇలా అనిపించిందా? అందరికీ ఇంతేనా? అని కొందరు తెలిసిన వాళ్లని అడిగితే ఇంతకన్నా ఘొరంగా విమర్శించారు. ఎ.అర్.అర్ నుంచి అందులో ఒక పెద్ద సినిమాకి ఇంత వీక్ ఆడియొ వస్తుందనుకోలేదు. బీట్ ప్రాధానంగా ఉన్నా కొంతలో కొంతైనా మాటలు వినపడి అర్ధమైతే బాగుండేది.

వినాలా వద్దా అనేది మీ ఇష్టమే..నా సలహా అడిగితే మాత్రం వినటం కష్టమే.!!